Tuesday 1 March 2022

సంవాదలేఖ-8 - శివుడితో ఓ చిన్న సంభాషణ

శివుడితో ఓ చిన్న  సంభాషణ
 సంవాదలేఖ-8


నేను-- "నీ ఎదుట మనసు కరగదేమయ్యా.. అంత పాషాణపు బండరాతినిచ్చావు-?" అంటే -
శివుడు-- "నేనూ పాషాణాన్నే కదా- నేనేమిటో- అదే ఇవ్వగలను-" అన్నాడాయన-
అప్పుడు నేనన్నాను- "నీ స్థాణుత్వం లోకపు ప్రహారాలు తాకకుండా ఆపుకుంటుంది.. నా పాషాణత్వం నీ భావన కలగకుండా ఆపుతుంది.. దీనికి నీ సమాధానమేంటి-?" అని.
ఆయన మౌనంగా ఉన్నాడు..
నేను-- "సరే- నీతో ఉంటే ఏదో ఓ రోజు నీలాగా అవుతానులే.." అని నవ్వాను.. ఆయనా నవ్వాడు.