Friday 18 March 2016

చిదీహ


          చిత్ అంటే ఆత్మ స్వరూపమైన సచ్చిదానందత్వంలో ఒక అంశం. భారతీయులు జ్ఞానరతులు. జ్ఞాననిరతే సనాతన ధర్మానికి ఆయువుపట్టు. జ్ఞానార్జన కోసం తపస్సు చేయటమే ప్రాచీనుల హైందవులకు తెలిసిన జీవనధ్యేయం. జ్ఞానపిపాసే వారి కణకణాల్లో ప్రవహించేది. యోగ సాధనలనీ, తపస్సులనీ, ఏ మార్గమైతేనేం.. అంతిమంగా పుష్పించే జ్ఞానం కోసమే..!! జ్ఞానం మనిషిని జీవంతం చేస్తుంది. జ్ఞానం మనిషి జీవితానికి సరైన నిర్వచనాన్ని ఇస్తుంది.

          చిత్- అంటే జ్ఞానం. ఈహ అంటే కోరిక. జ్ఞానం కోసం కోరికే ఈ చిదీహ. జ్ఞానస్వరూపుడైన నా ఇష్టదైవం చిదీశుడైన శివునికి ఈ చిదీహ సమర్పితం.

          శతకోటి నమస్సులతో-

          నిరీక్షణ