చిత్ అంటే ఆత్మ స్వరూపమైన సచ్చిదానందత్వంలో ఒక అంశం. భారతీయులు జ్ఞానరతులు.
జ్ఞాననిరతే సనాతన ధర్మానికి ఆయువుపట్టు. జ్ఞానార్జన కోసం తపస్సు చేయటమే ప్రాచీనుల హైందవులకు
తెలిసిన జీవనధ్యేయం. జ్ఞానపిపాసే వారి కణకణాల్లో ప్రవహించేది. యోగ సాధనలనీ, తపస్సులనీ, ఏ మార్గమైతేనేం..
అంతిమంగా పుష్పించే జ్ఞానం కోసమే..!! జ్ఞానం మనిషిని జీవంతం చేస్తుంది. జ్ఞానం మనిషి
జీవితానికి సరైన నిర్వచనాన్ని ఇస్తుంది.
చిత్- అంటే జ్ఞానం. ఈహ అంటే కోరిక. జ్ఞానం కోసం కోరికే ఈ చిదీహ. జ్ఞానస్వరూపుడైన
నా ఇష్టదైవం చిదీశుడైన శివునికి ఈ చిదీహ సమర్పితం.
శతకోటి నమస్సులతో-
నిరీక్షణ